User:Vgouripathi
నా పేరు వావిలాల గౌరీపతి. నేను భారతీయ వాయు సేనలో అధికారిగా పని చేసి వింగ్ కమాండర్ ర్యాంక్ లో స్వచ్చంద పదవి విరమణ చేశాను. మా తండ్రి గారు కీర్తి శేషులు వావిలాల సోమయాజులు గారు, గుంటూరు హిందూ కళాశాలలో తెలుగు పండితునిగా షుమారు మూడు దశాబ్దాలు పని చేశారు. వారు తెలుగు, ఇంగ్షీషు, సంస్కృతము, హిందీ భాషలలొ ప్రావీణ్యము కలిగి అనేక పుస్తకాలను రచించారు. వారు సాహితి సమితి అనే సంస్థకు కార్యదర్శిగా పని చేశారు. తల్లవఝుల శివ శంకర స్వామి వారికి సాహిత్య గురువులు. ఆయన ఆ కాలంలో, కవిగా, నాటక కర్తగా, వ్యాస రచయితగా వక్తగా, అధ్యాపకునిగా బహు ముఖీన ప్రతిభ కలవారు. వారు రచించిన అనేక పుస్తకాలను అన్నిటినీ విభజించి ఆయన సాహితి సర్వస్వాన్ని నాలుగు సంపుటాలలో ప్రచురించాలన్న ఉద్దేశ్యంతో మేము ముగ్గురు అన్నదమ్ములం సంకల్పించి చేసిన కృషి ఫలితమే ఈ " వావిలాల సాహితీ సర్వస్వం". నేను భౌతిక శాస్త్రంలో యం ఎస్సి, వాతావరణ శాస్త్రంలో యం ఫిల్ చేసినప్పటికీ తెలుగు సాహిత్యం పై అభిమానం పుట్టుక తో వచ్చింది. ప్రస్తుత విశ్రాంత జీవితాన్ని కోల్పోయిన సాహితీ సంరభాలను పొందాలని కృషి చేస్తున్నాను.